వికారాబాద్ జిల్లా ధారూర్ మండలం నాగసమందర్ గ్రామంలో భీమయ్య అనే రైతు ఉపాధి కోసం కడక్నాథ్ కోళ్లు తన ఇంటి దగ్గర పెంచుకుంటున్నాడు. అయితే కొంతమంది ఆ కోళ్లను రోజూ ఒక్కొక్కటి చొప్పున ఎత్తుకెళ్ళి కోసుకొని తింటున్నారు. రోజు ఒక కోడి మాయం అవుతుండడాన్ని గమనించిన భీమయ్య కోళ్లను చోరీ చేస్తున్న దొంగలను పట్టుకునే వేటలో ఉన్నాడు.