కోడిపందాలపై పోలీసుల దాడి... నీటి కాలువలో పడి ముగ్గురి మృతి

బుధవారం, 30 అక్టోబరు 2019 (09:07 IST)
దసరా, దీపావళి పండుగలను పురస్కరించుకుని ప్రకాశం జిల్లాలో జోరుగా కోడిపందాలు సాగాయి. ఈ విషయం పోలీసులకు తెలియడంతో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో కోడిపందెం జోరుగా సాగుతున్న సమయంలో పోలీసులు దాడి చేశారు. దీంతో పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోయే క్రమలో ముగ్గురు వ్యక్తులు నీటి కాలువలో పడి ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకరఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని చీరాల మండలం విజయనగర్ కాలనీ శివార్లలో కోడి పందాల స్థావరాలున్నాయని తెలుసుకున్న పోలీసులు దాడులు చేశారు. పోలీసులను చూసిన నిర్వాహకుల్లో ముగ్గురు పారిపోయే క్రమంలో సమీపంలోని కాలువలో పడి గల్లంతయ్యారు. వీరిలో ఇద్దరి మృతదేహాలను బయటకు తీశారు. వారిని మధు, శ్రీనుగా గుర్తించారు. గల్లంతైన మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు