అయితే తెలంగాణలో ప్రభుత్వం భారత్ బంద్‌కు మద్దతు ఇవ్వకపోవడంతో ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. ఇంకా రైతు చట్టాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ గుర్రపు బగ్గీపై అసెంబ్లీకి వచ్చారు. కానీ అసెంబ్లీ గేటు నుంచి లోనికి గుర్రపు బగ్గీని పోలీసులు అనుమతించలేదు. దీంతో కాంగ్రెస్ నేతలకు పోలీసుల మధ్య వాగ్వివాదం జరిగింది. దీంతో కాంగ్రెస్ నేతలు భట్టి, శ్రీధర్‌బాబు, సీతక్క, జీవన్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.
భట్టిని రాంగోపాల్‌పేట పీఎస్‌కు తలించారు. గుర్రాలపై అసెంబ్లీ లోనికి వెళ్తామని పట్టుబట్టారు ఎమ్మెల్యేలు. దీంతో వారిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. బీజేపీ, టీఆర్‌ఎస్ ఒక్కటేనని., కేంద్రం నిర్ణయాలను వ్యతిరేకించాలంటే కేసీఆర్ భయపడుతున్నారని టీ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.