దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరాను విజయవంతం చేయాలి.. కాంగ్రెస్

బుధవారం, 18 ఆగస్టు 2021 (11:12 IST)
తెలంగాణ రాష్ట్రంలోని రావిరాలలో బుధవారం పీసీసీ నిర్వహించే దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా సభను విజయవంతం చేయాలని డీసీసీ అధికార ప్రతినిధి గూడూరు శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. తుక్కుగూడ పరిధిలోని రావిరాలలో సభను నిర్వహిస్తున్నట్లు మంగళవారం తెలిపారు. 
 
2014 నుంచి కేసీఆర్‌ నేతృత్వంలో రాష్ట్రంలో రజాకార్ల పాలన కొనసాగుతోందని, ఎన్నికల హామీలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ విస్మరించారని శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో ఏ ఒక్క వర్గానికి న్యాయం జరగడం లేదన్నారు. దళితులకు ముఖ్యమంత్రి పదవి, మూడెకరాల భూమి ఇస్తానన్న కేసీఆర్‌ మాట తప్పారన్నారు. 
 
దళిత గిరిజనుల ఆత్మగౌరవం కోసం పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం రావిరాలలో జరిగే సభకు కాంగ్రెస్‌, యువజన కాంగ్రెస్‌, రేవంత్‌ అభిమానులు, ప్రజలు హాజరై విజయవంతం చేయాలని కోరారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు