కరోనా మరో ఆరు నెలలు ఉండొచ్చు: ఎమ్మెల్యే కోమటిరెడ్డి
గురువారం, 7 మే 2020 (19:26 IST)
కరోనా ప్రభావం మరో ఆరు నెలలు ఉండవచ్చని, అప్పటి వరకు ప్రజలు పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు.
గురువారం మునుగోడు నియోజకవర్గంలో తన తల్లి కోమటిరెడ్డి సుశిలమ్మ పౌండషన్ ద్వారా పేదలకు నిత్యావసర వస్తువుల పంపిణీని ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లాక్‌డౌన్‌లో పేదల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని సరుకులు పంచుతున్నామని తెలిపారు. 40వేల కుటుంబాలకు మూడు కోట్లతో నిత్యవసరాలు ఇస్తున్నామని చెప్పారు.
తన తల్లి సుశీలమ్మ పౌండేషన్ ద్వారా ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేపట్టామని ఎమ్మెల్యే అన్నారు. రాజకీయాలకు అతీతంగా నిజమైన పేదలకు సరుకులు అందజేస్తున్నామన్నారు. గ్రామాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించారు.
ఆర్ధికంగా ఉన్న వాళ్ళు ఆపన్నహస్తం అందించాల్సిన తరుణం ఇది అని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు.