ముఖ్యమంత్రి కేసీఆర్, ఆరోగ్య శాఖా మంత్రి ఈటల రాజేందర్ నిర్లక్ష్యం వల్లే కరోనా వ్యాప్తి విస్తరించిందని తీవ్ర స్థాయింలో విరుచుకుపడ్డారు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క. జనగామ జిల్లాగా ఏర్పడి నాలుగేళ్లు గడుస్తోన్నా.. ఆసపత్రిని పట్టించుకోకపోవడం దారుణమని కేసీఆర్ సర్కార్ పై మండిపడ్డారు.
ఇలాంటి దుర్మార్గపు ప్రభుత్వాన్ని ఎక్కడా చూడలేదన్నారు. సీఎల్పీ బృందం చేపట్టిన ప్రభుత్వ సందర్శన యాత్రలో భాగంగా జనగామ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించింది. ఆస్పత్రిలో రోగులకు అందుతున్న వైద్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. జనగామ ఆస్పత్రితో పేటెంట్లకు టెస్టులు చేసే సిటీస్కాన్, యాంజియోగ్రామ్, ఆర్టీపీసీఆర్ లాంటి సౌకర్యాలు లేకపోవడం రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.
అలాగే ఆస్పత్రిలో డాక్టర్లు, సిబ్బంది కొరత ఉందన్నారు. జనగామ జిల్లా ఆస్పత్రిలో 104 పోస్టులకు గానూ 32 పోస్టులు ఖాళీగా ఉందన్నారు. కరోనా బారిన పడిన డాక్టర్లకు, సిబ్బందికి వెంటనే ఎక్స్ గ్రేషియా, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని భట్టి విక్రమార్క అన్నారు.