1000 మందికి పైగా పోలీసులకు కరోనా

శనివారం, 24 ఏప్రియల్ 2021 (12:16 IST)
కరోనా కట్టడికి నిరంతరం కృషి చేస్తున్న హైదరాబాద్ పోలీసు శాఖ అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తోపాటు అటు రాచకొండ సీపీలు తమ సందేశాన్ని పంపారు.
 
రాచకొండ పరిధిలో 225 మంది పోలీసు సిబ్బంది కరోనా బారిన పడగా హైదరబాద్ కమిషనరేట్ పరిధిలో 700 మంది పోలీసులకు కరోనా పాజిటివ్‌గా ఉందని వెల్లడించారు. దీంతో ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేయించుకోవాలని వారు కోరారు. రాచకొండ పరిధిలో 95 శాతం మందికి వ్యాక్సిన్ పూర్తికాగా ఇప్పటికే నగరంలో 41 మంది పోలీస్ సిబ్బంది కరోనా మృత్యువాత పడ్డారని సీపి అంజని కుమార్ తెలిపారు.
 
కరోనా భారిన పడిన పోలీసుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు జూం మీటింగ్ ద్వార మాట్లాడుతున్నట్టు సీపీ మహెష్ భగవత్ వివరించారు. దీంతోపాటు మెడికల్ కిట్స్, డ్రైఫ్రూట్స్ కిట్‌తోపాటు అయిదు వేల రూపాయలను వారి ఖాతాల్లో వేస్తున్నట్టు చెప్పారు.
 
ఇక గత సంవత్సరం కూడ 3800 మంది పోలీసులు కరోనా భారిన పడ్డారని చెప్పారు. దీంతో టీకా వేయించుకోవడం ద్వారనే తమని తాము రక్షించుకునే అవకాశం ఉందని వెల్లడించారు. మరోవైపు గత మూడు రోజుల నుండి నగరంలో రాత్రి కర్ఫ్యూ నిర్వహిస్తుండడంతో పోలీసుల గస్తి తీవ్రం చేశామని చెప్పారు. మూడు రోజుల్లో కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన 200 మందిపై కేసులు నమోదు చేసినట్టు మహెష్ భగవత్ వివరించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు