వారు అనర్హులు కారా... తెలంగాణ స్పీకర్ కు హైకోర్టు నోటీసులు జారీ

బుధవారం, 4 మార్చి 2015 (21:47 IST)
జంపింగ్ జపాంగులను ఎందుకు ఉపేక్షిస్తున్నారు. వారు అనర్హులు కారా.. మరి వారిని ఎందుకు అనర్హులుగా ప్రకటించారు. వారు పార్టీ ఫిరాయింపు చట్టాన్ని ఉల్లంఘించలేదా.. మరెందకు మిన్నకుండిపోయారు. వెంటనే సమాధానం చెప్పాలంటూ హైకోర్టు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పై మండిపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. 
 
తెలంగాణలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల నుంచి టీఆర్ఎస్ లోకి ఎమ్మెల్యేలు జంప్ చేసిన విషయం తెలిసిందే. ఈ జంపింగ్ ఎమ్మెల్యేలపై తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీలు రెండు తమ పార్టీల నుంచి వెళ్లిన ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపు చట్టాన్ని ఉల్లంఘించారనీ, వారిని అనర్హులుగా ప్రకటించాలని తెలంగాణ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. అయితే చాలా కాలంగా దీనిని పెండింగ్ లో పెట్టడడంతో వారు కోర్టు తలుపు తట్టారు. 
 
అలాగే ఎమ్మెల్సీల విషయంలో శాసనమండలి ఛైర్మన్ కు ఫిర్యాదు చేశారు. అయితే రెండు చట్టసభల నుంచి సమాధానం రాకపోవడంతో వారు కోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన కోర్టు ఎమ్మెల్సీలు కేఆర్ ఆమోస్, భూపాల్ రెడ్డి, రాజలింగం, భాను ప్రసాద రావు, ఎస్ జగదీశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస యాదవ్,తీగెల కృష్ణా రెడ్డి, సిహెచ్ ధర్మా రెడ్డిల అనర్హతపై తేల్చి చెప్పాలని చెప్పారు. దీనిపై వివరాలు ఇవ్వాలని నోటీసులు జారీ చేశారు. 

వెబ్దునియా పై చదవండి