ఆదివారం నుంచే ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. బెంగళూరుకు చెందిన తుంబి ఏవియేషన్ సంస్థ హనుమకొండ జిల్లా కేంద్రంలోని ఆర్ట్స్ కాలేజీ నుంచి మేడారం జాతరకు భక్తులను తరలించేందుకు హెలిప్యాడ్ సిద్ధం చేసింది. ఇందుకోసం ఒక్కోక్కరికి 20వేల రూపాయలు చార్జీగా నిర్ణయించారు. అటు ఆర్టీసీ 3 వేల 850 బస్సుల ద్వారా 21 లక్షల మంది ప్రయాణికులను చేరవేసేందుకు చర్యలు చేపట్టింది.
తాత్కాలికంగా ఆస్పత్రిని నిర్మించామని, 35 హెల్త్ క్యాంపులను ఏర్పాటు చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. స్నాన ఘట్టాల ఏర్పాటుతో పాటు అంటువ్యాధులు ప్రబలకుండా, నీరు కాలుష్యం కాకుండా నిరంతరం క్లోరినేషన్ చేయనున్నట్లు చెప్పారు.