తెలంగాణా రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా ఈటల రాజేందర్

గురువారం, 27 మే 2021 (20:15 IST)
మాజీమంత్రి, తెరాస ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతున్నారు. ఆయన చుట్టూ కాంగ్రెస్, బీజేపీ ప్రదక్షిణలు చేస్తున్నాయి. ఈ రెండు పార్టీలు ఆయనను ఎగురవేసుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. రాజేందర్‌పై భూ కబ్జా ఆరోపణలు రావడంతో సీఎం కేసీఆర్, మంత్రి పదవి నుంచి తప్పించారు. అయితే ఆయనను టీఆర్‌ఎస్ నుంచి బహిష్కరిస్తున్నట్లు గులాబీ పార్టీ ప్రకటించలేదు. 
 
ప్రస్తుతం ఈటల రాజకీయ జీవితం ప్రశ్నార్థకంగా మారింది. ఏ వేదికనూ ఎంచుకోలేక ఆయన సతమతవుతున్నారు. అయితే కాంగ్రెస్, బీజేపీలు తమ గాలాన్ని సిద్ధంగా పెట్టుకున్నాయి. రెండు రోజుల క్రితం రాజేందర్‌ను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి కలిశారు. కిషన్‌ రెడ్డిని తాను కలిసింది నిజమేనని ఈటల రాజేందర్‌ అంగీకరించారు కూడా. ఒక్క కిషన్‌రెడ్డినే కాదని, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్‌నీ కలిసినట్లు తెలిపారు. 
 
తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈటల బీజేపీ వైపు అడుగులు వేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.
ఈ పరిణామాలను నిశితంగా పరిశీలించిన కాంగ్రెస్ పార్టీ ఈటలతో రాయబారం నడిపింది. ఈ రాయబారానికి ఆ పార్టీ నేత రేవంత్‌రెడ్డి వ్యూహకర్తగా వ్యవరించారు. కాంగ్రెస్ నుంచి ఇద్దరు దూతను రాజేందర్ దగ్గరకు పంపారు. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, ఈటలతో రాయబారం నడిపారు. 
 
కేసీఆర్‌కు వ్యతిరేకంగా పోరాటం చేసే ఐక్య వేదికకు కోసం కలిసి రావాలని కోదండరాం సూచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ రాయబారం ఫెయిల్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. రేవంత్ గట్టి ప్రయత్నం చేసినా ఈటల అంగీకరించలేదనే ప్రచారం జరుగుతోంది. బీజేపీలో చేరిక నిర్ణయాన్ని మార్చుకునేది లేదని ఈటల చెప్పినట్టు సమాచారం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు