ఫేస్ బుక్‌లో ఫ్రెండ్ రిక్వెస్ట్ మహిళకు పంపించి చాటింగ్ చేసి తొమ్మిది లక్షల మోసం

సోమవారం, 27 ఏప్రియల్ 2020 (23:19 IST)
ఫేస్ బుక్‌లో ఫ్రెండ్ రిక్వెస్ట్ మహిళకు పంపించి, పరిచయం పెంచుకుని చాటింగ్ చేసి తొమ్మిది లక్షల మోసం చేశాడు యూఎస్‌కు చెందిన సైబర్ మోసగాడు. ఫేస్ బుక్‌లో మొదలైన వీరి చాటింగ్. ఫోన్లో వాట్సాప్ చాటింగ్ వరకూ వచ్చింది. ఇండియాకు వస్తున్నానని మహిళకు చెప్పాడు సైబర్ నేరగాడు.
 
చెప్పిన రెండు రోజులకు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో పోలీసులు తనను అదుపులోకి తీసుకుని తన వద్ద ఉన్న భారీ నగదు సీజ్ చేశారని, వదిలేయాలంటే లక్ష యాభై వేల రూపాయలు ఇస్తే సరిపోతుందంటూ మహిళకు ఫోన్ చేసిన చెప్పాడు చీటర్.
 
నమ్మిన ఆమె ఆన్లైన్ ద్వారా మనీ అకౌంట్‌కు ట్రాన్స్ఫర్ చేసింది. సీజ్ చేసిన డబ్బులు తీసుకోవాలంటే ఇన్కమ్ టాక్స్, కస్టమ్స్ చెల్లించాలని, దాని కోసం మరికొంత డబ్బులు కావాలని కోరాడు. మనీ వచ్చిన తర్వాత నీకు భారీ మొత్తంలో మనీ ఇస్తానని చెప్పాడు.
 
మాటలకు నమ్మి జనవరి నుండి ఏప్రిల్ వరకు  మొత్తం 9 లక్షల 55, 000 నగదు ట్రాన్స్ఫర్ చేసింది హైదరాబాద్ తిరుమలగిరికి చెందిన మహిళ. చీటర్ చేసిన ఫోన్ పలుమార్లు చేసినా స్విచాఫ్ ఉండటంతో మోసం చేశారని గమనించింది. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఫేస్ బుక్, వాట్సాప్ చాటింగ్ గుర్తుతెలియని వ్యక్తులతో చేయకూడదని హెచ్చరిస్తున్నారు  పోలీసులు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు