మాజీ ఎమ్మెల్యే ప్రాణాల‌కు దిక్కేది...? ప్రాణ‌బిక్ష పెట్టాలంటూ కేసీఆర్‌కు విజ్ఞ‌ప్తి

శుక్రవారం, 18 డిశెంబరు 2020 (06:06 IST)
తెలంగాణ రాష్ట్రంలో ప్ర‌జా ప్ర‌తినిధుల‌కే ర‌క్ష‌ణ లేకుండా పోతుంది. స్వయంగా మాజీ ఎమ్మెల్యే త‌న‌కు ప్రాణ ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని క‌రీంన‌గ‌ర్ పోలీస్ క‌మిష‌న‌ర్‌, ముఖ్య‌మంత్రి కె. చంద్ర‌శేఖ‌ర్‌రావుకు విజ్ఞ‌ప్తి చేస్తున్నారు.

క‌రీంన‌గ‌ర్‌లోని త‌న 4 ఎక‌రాల వ్య‌వ‌సాయ ‌భూమిని కొంద‌రు ల్యాండ్ మాఫియా క‌బ్జా చేసేందుకు కుట్ర‌లు చేస్తూ త‌ను చంప‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నార‌ని భ‌యాందోళ‌న వ్య‌క్తం వ్య‌క్తం చేశారు.. ఈ మేర‌కు స‌ద‌రు చొప్ప‌దండి నియోజ‌క‌వ‌ర్గ  మాజీ ఎమ్మ‌ల్యే సానా మారుతి విడుద‌ల చేసిన ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు.

త‌మ‌ను బెదిరించి సుమారు  రూ. 20 కోట్ల‌విలువైన భూమిని క‌బ్జా చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. రెవెన్యూ రికార్డుల్లో త‌న భార్య  సానా ల‌క్ష్మీ పేరుతో ఉంద‌ని, అయినా కూడా కొంత‌మంది ల్యాండ్ మాఫియా త‌న‌ను బెదిరించి భూమిని లా‌క్కునేందుకు శ‌త‌విధాల ప్ర‌య‌త్నిస్తున్నార‌ని ఆరోపించారు.

ఒక ఎమ్మెల్యేకి సంబంధించిన భూమిని సైతం క‌బ్జాకోరులు లాక్కునేందుకు బెదిరింపుల‌కు పాల్ప‌డుతున్నార‌ని ఆందోళ‌న వ్య‌ర్తం  చేశారు. భూ క‌బ్జాకు సంబంధించి వివ‌రాలు ఇలా ఉన్నాయి. ‌క‌రీంన‌గ‌ర్ ప‌ట్ట‌ణంలోని  కరీంనగర్ పట్టణంలోని బొమ్మకల్ ప్రాంతంలో సర్వే నెంబర్ 723 , 724 లో ఏడు ఎకరాల వ్యవసాయ భూమిని వెలిచల తిరుపతిరావు ( అయితపల్లి తిరుపతి రావు )  నుంచి 1971లో కొనుగోలు చేశామ‌ని వెల్ల‌డించారు.

అప్ప‌టినుంచి  ఈ పట్టా భూమిని రెవెన్యూ చట్టాలకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ తో పాటు ముటేషన్ చేయించుకున్నాము.  ఆనాటి నుంచి  ఇప్పటి వరకు రెవెన్యూ రికార్డులో ఈ భూమి నా భార్య సానా లక్ష్మి పేరు మీద ఉంది . ఈ 7 ఎక‌రాల భూమిలో నుంచి 2003లో వ్యక్తిగత అవసరాల కోసం మూడు ఎకరాల భూమిని బుర్ర నర్సయ్య అనే వ్యక్తికి విక్రయించాను.

ఈ మూడు ఎకరాల భూమి పోగా మిగతా 4 ఎక‌రాల భూమి నా భార్య పేరు మీదనే ఉంది . ఈ భూమికి సంబంధించిన హద్దులతో సహా పాస్ బుక్ , టైటిల్ డీడ్ వంటి వివరాలు ధరణి పోర్టల్ లో కూడా నా భార్య పేరు మీదనే ఉన్నాయి. 50 సం వత్సరాలకు పైగా (1971 నుండి )  నేటి వరకు పొజిషన్లో కూడా  ఉన్నామ‌న్నారు.

ఈ భూమికి కాంపౌండ్ వాల్ కూడా వేసిన‌ట్లు తెలిపారు. ఇదే బొమ్మకల్ గ్రామంలో మాజీ ఎమ్మెల్యే నలమాచం కొండయ్యకు సర్వేనెంబర్ 724 లో  నాలుగు ఎకరాల 20 గుంటల స్మశానవాటిక‌ భూమి ఉన్నట్టు పహాణి లో ఉంది . ఈ సర్వే నెంబర్ తో స్మశానంలో తప్ప వేరే ఎక్కడ నలమాసు కొండయ్యకు భూమి లేదు.

ఈయన జీవిత కాలంలో తనకు సర్వే నెంబర్ 724 లో ఎక్కడ భూమి ఉన్నట్లు చెప్పలేదు . ఈ భూమి కోసం ప్రయత్నం కూడా చేయలేదు . సర్వేనెంబర్ 724 లో నలమాసు కొండయ్య గారికి భూమి ఉన్నట్లు టైటిల్ గాని , పొజిషన్ గానీ ఎక్కడా లేదు. 1976 సంవత్సరంలో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ రావడంతో నలమాసు కొండయ్య పేరు మీద ఒక ఎకరం 30 సెంట్లు మిగులు భూమి ఉందని అప్పటి ఆర్డీవో నిర్ధారణ చేశారు.

1986 వ సంవత్సరంలో ప్రభుత్వం బొమ్మకల్ గ్రామంలో బలహీనవర్గాల కోసం భూమి కేటాయించింది . దీనికోసం నలమాసు కొండయ్య మిగులు భూమిని గుర్తించమని ప్రభుత్వం చెప్పింది . దీంతో రెవెన్యూ అధికారులు పొరపాటున భుమ్మి నా భార్య పేరు మీద సర్వే నెంబర్ 724 లో ఉన్న భూమిని  సుమోటోగా తీసుకొని మిగులు భూమిగా బావించి బలహీనవర్గాలకు కేటాయించారు.

అప్పుడు నేను ఉద్యోగరీత్యా నిజామాబాద్ జిల్లా లో పని చేస్తుండే వాడిని, ఈ విషయము తెలియ‌డంతో వెంటనే జిల్లా కలెక్టర్ ను కలిసి  భూమికి సంబంధించిన పూర్తి డాక్యుమెంట్లను ఇవ్వ‌డం  జరిగింది. అదేవిధంగా భూసంస్కరణలకు సంబందించిన ఆర్డీవోకు పిటిషన్ కూడా ఇచ్చాను.

దీనిపై  విచారణ జరిపిన సంబంధిత అధికారులు ఈ విషయంలో తాము పొరపాటు చేశామని ఒప్పుకొని పట్టా భూమి సాన  లక్ష్మి గారి దేనని  రికార్డులు సవరించారు. దీనికి సంబంధించి నల్ల మాస కొండయ్య గారు కూడా ప్రభుత్వ అధికారులు పొరపాటు చేశారని ప్రభుత్వం 723, 724 సర్వే నెంబర్లలో బలహీనవర్గాలకు కేటాయించిన భూమి అది పూర్తిగా సా న లక్ష్మీ గారి దేనని సర్వేనెంబర్ 723, 724 లో ఉన్న భూమికి తనకు  ఎటువంటి  సంబంధం  లేదని కోర్టులో అఫిడవిట్ సమర్పించడం జరిగింది.

ఈ విషయం పై తాము  హైకోర్టు ను ఆశ్రయిస్తే  విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం 723,724 సర్వేనెంబర్ లో ఉన్న భూమిపై పూర్తి హక్కులు  సాన లక్ష్మికి  ఉంటాయని తీర్పు ఇచ్చింది. ఈ భూమిపై పై దివంగత మాజీ ఎమ్మెల్యే నల మాసు కొండయ్య కు,  అతని కుటుంబ సభ్యుల గాని ఎటువంటి హక్కులు లేవు. 

ప్రస్తుతము కరీంనగర్ పట్టణంలో భూములకు ధర పెరుగుతుండటంతో లాండ్ మాఫియా కన్ను మా భూమి పై పడింది విలువైన మా భూమి ని ఎలాగైనా నా కబ్జా చేసుకోవాలని దురుద్దేశంతో కొంతమంది కబ్జా రాయుళ్లు  ప్రయత్నం చేస్తున్నారు. 2009వ సంవత్సరంలో లో మరణించిన నల్ల మాస కొండయ్య కుటుంబసభ్యులను ప్రలోభపెట్టి ధనాశ చూపించి ఎలాగైనా త‌న‌  భూమిని కబ్జా చేయాలని ప్రయత్నం చేస్తున్నారు.

త‌న  నా భార్య  సానా ల‌క్ష్మి అనారోగ్యం కారణంగా హైదరాబాదులో ఉండటంవల్ల కబ్జాదారులు పెట్రేగి పోతున్నారు. ఆ భూమికి కాపలాదారు గా ఉన్న వ్యక్తులను అనేక రకాలుగా వేధిస్తూ,  త‌న‌ కుటుంబ సభ్యులను భయబ్రాంతులకు గురి చేస్తున్నార‌ని ఆరోపించారు. ఒక  మాజీ శాసనసభ్యుడు అని తెలిసి కూడా ల్యాండ్ మాఫియా కనీస మర్యాద పాటించకుండా  అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతూ మమ్ములను భయభ్రాంతులకు గురి చేస్తున్నార‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. 

ఈ విషయమై కరీంనగర్ జిల్లా  కలెక్టర్,పోలీస్ కమిషనర్, సంబంధిత అధికారుల ను కలిసి   తమకు రక్షణ కల్పించి  తమ భూమి కబ్జా గురికాకుండా చూడవలసిందిగా  ఫిర్యాదు చేయడం జరిగింద‌ని వివ‌రించారు.   

ఈ  భూక‌బ్జా విషయంలో ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు పెద్ద మనసుతో జోక్యం చేసుకొని మమ్ములను భయభ్రాంతులకు గురిచేస్తున్న లాండ్ మాఫియా మీద వెంటనే కఠిన చర్యలు తీసుకొని మాకు రక్షణ కల్పించవల్సిందిగా  విజ్ఞప్తి చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు