రూ. 2 వేలు చెక్కును రూ. 12 వేలుగా మార్చిన మాజీ భార్య... ఆ తర్వాత...

మంగళవారం, 25 సెప్టెంబరు 2018 (16:47 IST)
మెహదీపట్నం పద్మనాభనగర్ కాలనీకి చెందిన గణపతి (46) శ్రీదేవి(38)లకు 1998లో వివాహం జరిగింది. కుటుంబ కలహాలు కారణంగా 2007లో  విడాకులు తీసుకున్నారు. భార్యకు భరణంగా రూ. 4 వేలు ప్రతినెలా ఇవ్వాలని భర్తకు న్యాయస్థానం తీర్పునిచ్చింది. 2008లో గణపతి తండ్రి  ఆస్పత్రిలో ఉండటంతో డబ్బులు సర్దుబాటు కాకపోవడంతో రూ. 4 వేలకు బదులుగా రూ. 2 వేలు చెక్కు ఇచ్చారు గణపతి.
 
దాంతో ఆ 2 వేలు చెక్కుకు ముందు 1 పెట్టి రూ.12 వేలు డ్రా చేసింది శ్రీదేవి. బ్యాంకు స్టేట్మెంట్ చూసిన గణపతి 2008లో లంగర్ హౌస్  పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన అప్పటి ఎస్.ఐ సంతోష్ కుమార్ ఆధారాలు సేకరించి కోర్టులో ఛార్జిషీలు దాఖలు చేశారు. సుదీర్ఘ విచారణ  చేపట్టిన అనంతరం 6వ అదనపు చీఫ్ మెట్రోపాలిటిన్ మేజిస్ట్రేట్ హరీష్ మోసానికి పాల్పడిన భార్య శ్రేదేవికి మూడు సంవత్సరాల కారాగార శిక్ష. 35 వేలు జరిమానా విధించారు. ఈ కేసు విచారణకు పదేళ్లు పట్టింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు