ఆయనతోపాటు ఎంపీలుగా నిజామాబాద్ నుంచి గెలుపొందిన ధర్మపురి అరవింద్, కరీంనగర్ నుంచి గెలుపొందిన బండి సంజయ్, ఆదిలాబాద్ నుంచి గెలుపొందిన సోయం బాపురావుల్లో మరొకరికి కూడా ప్రాధాన్యం దక్కుతుందని బీజేపీ రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది.
రాష్ట్రంలో సికింద్రాబాద్ నుంచి ఎంపీగా గెలుపొందిన కిషన్‌రెడ్డికే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. అంబర్‌పేట నియోజకవర్గం నుంచి 2004, 2009, 2014 ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.