GHMC ఎన్నికలు: ఓటు వేసిన కేటీఆర్, మెగాస్టార్ దంపతులు

మంగళవారం, 1 డిశెంబరు 2020 (10:12 IST)
ఫోటో కర్టెసీ-ట్విట్టర్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి)కు ఎన్నికల పోలింగ్ డిసెంబర్ 1న ప్రారంభమైంది. ఉదయాన్నే మంత్రి కేటీఆర్, మెగాస్టార్ చిరంజీవి దంపతులతో సహా చాలామంది సెలబ్రిటీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కార్పొరేషన్ పరిధిలోని ఓటర్లందరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని పార్టీలన్నీ పిలుపునిచ్చాయి.
ఇకపోతే జిహెచ్ఎంసి ఓట్ల లెక్కింపు డిసెంబర్ 4న జరుగుతుంది. కార్పొరేషన్‌లో మొత్తం 150 వార్డులు ఉన్నాయి. మేయర్ పదవి ఈసారి మహిళకు కేటాయించారు. హైదరాబాద్ పౌర పరిపాలన మరియు మౌలిక సదుపాయాల బాధ్యత జిహెచ్‌ఎంసికి ఉంది. 2016 ఎన్నికల్లో AIMIM 44 సీట్లు గెలుచుకున్నది. టిఆర్ఎస్ 99 సీట్లను కైవసం చేసుకోగా, బిజెపి కేవలం 4 సీట్లు సాధించింది. టిడిపి, కాంగ్రెస్ రెండు సీట్లు గెలుచుకున్నాయి.
GHMC గురించి కాస్త...
మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ (ఎంసిహెచ్)లో 12 మునిసిపాలిటీలు, 8 గ్రామ పంచాయతీలను విలీనం చేయడం ద్వారా ఏప్రిల్ 16, 2007న జిహెచ్ఎంసి- గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఏర్పడింది. నాలుగు జిల్లాలు ఇప్పుడు జిహెచ్‌ఎంసి పరిమితుల్లోకి వస్తాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్‌గిరి, సంగారెడ్డి. ఈ నాలుగు జిల్లాలను ఆరు మండలాలు, 30 సర్కిల్స్ మరియు 150 మునిసిపల్ వార్డులుగా విభజించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు