ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు తెలంగాణ సర్కారు మరో గుడ్ న్యూస్ తెలిపింది. రీవాల్యుయేషన్, రీకౌంటింగ్ కోసం ధరఖాస్తు చేసుకున్న వారు... తమ దరఖాస్తును రద్దు చేసుకోవడానికి శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకు అవకాశం కల్పించింది. దీని కోసం చెల్లించిన ఫీజును తిరిగి పొందవచ్చని ప్రకటించింది.