ఈ పరీక్ష కోసం హైదరాబాద్, మహబూబ్ నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, మెదక్ జిల్లాలతో పాటు సిద్ధిపేట, సంగారెడ్డి జిల్లాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇది ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగనుంది.
గురుకుల వెబ్ సైట్ నుంచి ఈ పరీక్షకు సంబంధించిన హాల్‌టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలాగే, హాల్ టిక్కెట్లలో ఏవేని తప్పులు దొర్లినా, అక్షర దోషాలు ఉన్నా పరీక్షా కేంద్రం వద్దకు తగిన ఆధారాలతో వెళ్లి సరిచేసుకోవచ్చని సూచించారు.