తెలంగాణ సీఎంవో అదనపు కార్యదర్శి స్మిత సబర్వాల్ ఔట్లుక్ పత్రికపై మండిపడ్డారు. అంతేగాకుండా ఆ పత్రికకు లీగల్ నోటీసులు పంపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమకారులకు ఆమె సహకరించారని.. దానిని గుర్తించిన తెలంగాణ సీఎం జూనియర్ అధికారిణి అయినప్పటికీ.. ఆమెకు కీలకమైన సీఎంవో అడిషనల్ సెక్రటరీ స్థాయి కల్పించారని ఔట్లుక్ పత్రిక తన కథనంలో పేర్కొంది.