ఓవైసీ బ్రదర్స్‌కు చుక్కెదురు

గురువారం, 27 సెప్టెంబరు 2018 (14:31 IST)
ఓవైసీ బ్రదర్స్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. తెలంగాణ ప్రభుత్వం ఓవైసీ బ్రదర్స్‌కు నామ మాత్రపు ధరకు 6,500 చదరపు గజాల స్థలాన్ని కేటాయించడాన్ని సవాలు చేస్తూ షేక్ అనిషా హైకోర్టులో పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టు నిబంధనలను పక్కన పెట్టి తెలంగాణ ప్రభుత్వం ఓవైసీ బ్రదర్స్‌కు  ప్రభుత్వ భూమిని ఎలా కేటాయిస్తారని పిటీషన్లో పేర్కొన్నారు అనిషా. 
 
ఇందుకోసం ఎటువంటి  టెండర్లు పిలవకుండా బిడ్డింగ్ జరపకుండా చాంద్రాయణగుట్టలో ఉన్న 6,500 చదరపు గజాల స్థలాన్ని ఎలా కేటాయిస్తారని, వెంటనే ప్రభుత్వం ఓవైసీ బ్రదర్స్‌కు కేటాయించిన స్థలాన్ని వెనక్కి తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని పిటీషనర్ కోరాడు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఒవైసీ హాస్పిటల్ కోసం కేటాయించిన భూమిపై 3 నెలల వరకు స్టే విధించింది హైకోర్టు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అసదుద్దీన్, అక్బరుద్దీన్‌కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను 3 నెలలు వాయిదా వేసింది హైకోర్టు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు