తెలంగాణ మద్యం దుకాణాలకు భారీగా దరఖాస్తులు

సోమవారం, 15 నవంబరు 2021 (22:14 IST)
తెలంగాణలో మద్యం దుకాణాల లైసెన్స్‌ల కోసం దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2,620 మద్యం దుకాణాలకు నూతన మద్యం పాలసీ డిసెంబర్‌ ఒకటి నుంచి నూతన లైసెన్సులు కేటాయించనున్నారు.

ఇందు కోసం అర్హులైన వారి నుంచి ఎక్సైజ్‌శాఖ దరఖాస్తులు స్వీకరిస్తున్నది. గతంలో ఉన్న మద్యం దుకాణ లైసెన్స్‌ దరఖాస్తునకు రూ.2 లక్షల నాన్‌ రిఫండబుల్‌ ఫీజును నిర్ణయించారు. కాగా, సోమవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా 6,600 దరఖాస్తులు వచ్చినట్టు సమాచారం.
 
కేవలం సోమవారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలిపి 3,750 దరఖాస్తులు అందాయి. ఇప్పటి వరకు అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 1,064 దరఖాస్తులు వచ్చాయి. సోమవారం ఒకే రోజు 684 దరఖాస్తులు వచ్చాయి.

హైదరాబాద్‌లోనూ ఇప్పటి వరకు 277 వచ్చినట్టు తెలిసింది. కాగా, 2019లో మద్యం దుకాణ లైసెన్స్‌లకు మొత్తం 49వేల వరకు దరఖాస్తులు వచ్చాయి. ఈ సారి ఆ సంఖ్య 50వేలకుపైగా వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు