తెలంగాణకు వర్షం ముప్పు.. వచ్చే మూడు రోజుల పాటు..?

సోమవారం, 15 నవంబరు 2021 (13:15 IST)
హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం తెలంగాణకు సైతం వర్షం ముప్పు పొంచి ఉంది. రాగల మూడు రోజుల పాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.
 
అయితే ఇప్పటికే కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తం అయింది. కాగ బంగాళ ఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని తెలిపింది. ఈ నెల 15న ఉత్తర అండమాన్‌ సముద్రం, దానిని ఆనుకుని ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ అల్ప పీడనం వాయుగుండంగా బల పడే అవకాశం ఉందని పేర్కొంది.
 
వీటి ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కిందిస్థాయి నుంచి వీస్తున్న గాలులు తూర్పు దిశ నుంచి తెలంగాణ వైపునకు వీస్తున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు