మైనర్ బాలికకు ఉద్యోగం ఇప్పిస్తామని మాయమాటలు చెప్పి.. ఆపై ఆమెను బలవంతంగా వ్యభిచార కూపంలోకి దింపిన వ్యభిచార ముఠా గుట్టును బాలాపుర్పోలీసులు రట్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. బాలాపూర్రాయల్కాలనీలోని వ్యభిచార గృహంపై బాలాపూర్పోలీసులు శనివారం రాత్రి దాడులు నిర్వహించారు. వ్యభిచార కూపం నుంచి 17 సంవత్సరాల మైనర్‌బాలికకు విముక్తి కలిగించారు.
లాపూర్రాయల్కాలనీకి చెందిన రెహానా బేగం, సయ్యద్అబూబకర్ భార్యభర్తలు. తక్కువ సమయంలో సులభంగా డబ్బు సంపాదించాలన్న ఉద్దేశ్యంతో రెహానా బేగం, సయ్యద్అబూబాకర్ తన స్నేహితురాలు సల్మాబేగంతో కలిసి వ్యభిచారం చేయాలని నిర్ణయించుకున్నారు. చాంద్రాయణగుట్టలో ఉంటున్న సమయంలో.. పక్కింటికి చెందిన 17 సంవత్సరాల బాలిక ఏదైనా ఉద్యోగం ఉంటే ఇప్పించాలంటూ రెహానాబేగంను కోరింది. ఇదే అదనుగా భావించి రేహానా బేగం.. ఆ మైనర్‌బాలికకు మంచి ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి వ్యభిచార కూపంలోకి దింపింది.
అయితే పోలీసులు రెక్కీ నిర్వహించి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేశారు. మైనర్బాలికను అదుపులోకి తీసుకుని రెస్క్యూ హోంకు తరలించారు. వ్యభిచారం నిర్వహిస్తున్న రెహానా బేగం, సయ్యద్ అబూబకర్, సల్మాబేగం, విటుడు మహ్మద్ అష్యులను బాలాపూర్పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.