వినాయక నిమజ్జనం.. ఓన్లీ పెద్ద విగ్రహాలే ట్యాంక్ బండ్ వద్దకు..?

సోమవారం, 6 సెప్టెంబరు 2021 (20:37 IST)
వినాయక నిమజ్జనాల నిమజ్జనాల సందర్భంగా నగరం నలుమూలల నుంచి వినాయక విగ్రహాలను నిమజ్జనం నిమిత్తం ట్యాంక్ బండ్‌కు తీసుకొనివస్తారు. ఇళ్లలో ప్రతిష్టించే చిన్న విగ్రహాలు మొదలు.. పెద్ద పెద్ద విగ్రహాలను కూడా ట్యాంక్ బండ్‌లో నిమజ్జనం చేసేందుకు భక్తులు ఆసక్తి కనబరుస్తారు. 
 
నగర శివారు ప్రాంతాల్లో వినాయక నిమజ్జనం చేసేందుకు కొన్ని అనువైన ప్రదేశాలు ఉన్నప్పటికీ.. చాలా మంది వినాయక విగ్రహాలను ట్యాంక్ బండ్‌ వద్ద నిమజ్జనం చేయాలని భావిస్తారు. ఈ క్రమంలోనే జనాలు కూడా వినాయ నిమజ్జనానికి చూసేందుకు భారీగా ట్యాంక్ బండ్ వద్దకు తరలివస్తారు.
 
అయితే ఈ ఏడాది ట్యాంక్ బండ్‌ వద్ద వినాయక నిమజ్జన కార్యక్రమానికి సంబంధించి పోలీసులు కీలక సూచనలు చేశారు. కేవలం పెద్ద విగ్రహాలకు మాత్రమే ట్యాంక్ బండ్‌కు అనుమతి ఉంటుందని హైదరాబాద్‌ నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ స్పష్టం చేశారు.
 
సోమవారం ట్యాంక్ బండ్‌పై వినాయక నిమజ్జనానికి సంబంధించి పోలీసులు చేస్తున్న ఏర్పాట్లను సీపీ అంజనీకుమార్ పరిశీలించారు. ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసిన సుందరీకరణ దెబ్బతినకుండా ట్రయల్ రన్‌ను పోలీసులు నిర్వహించారు. గణేష్ నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని సీపీ అంజనీకుమార్ చెప్పారు. త్వరగా నిమజ్జనం చేసేందుకు ఆటోమేటిక్‌ ఐడల్‌ రిలీజ్ సిస్టమ్‌ను వాడుతున్నామని వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు