కరోనా వ్యాక్సిన్ పేరిట మత్తు ఇంజెక్షన్.. బంగారు నగల్ని దోచేసిన నర్సు.. ఎక్కడ?

సోమవారం, 15 ఫిబ్రవరి 2021 (17:11 IST)
కరోనా వ్యాక్సిన్ పేరిట ఓ నర్సింగ్ స్టూడెంట్ దోపిడీకి పాల్పడింది. ఏదో కెమికల్ కలిపిన మత్తు ఇంజెక్షన్‌ను కోవిడ్ వ్యాక్సిన్ అంటూ ఓ వృద్ధదంపతులకు వేసింది. వారు మత్తులోకి జారుకున్నాక వారివద్ద వున్న బంగారు నగలను దోచుకెళ్లింది. ఈ ఘటన హైదరాబాదులోని మీరట్, లలితా నగర్‌లో శనివారం చోటుచేసుకుంది. బాధితులు లక్ష్మణ్ (80), ఆయన భార్య కస్తూరి (70)లను కలిసి కరోనా వ్యాక్సిన్ అని ఇంజెక్షన్ వేసిన నర్సింగ్ స్టూడెంట్ వారి వద్ద నగలను దోచుకుంది. 
 
లక్ష్మణ్ రిటైర్డ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఉద్యోగి. కస్తూరి గృహిణి. వీరివద్దకు 21 ఏళ్ల అనూష అనే నర్సింగ్ యువతి.. కోవిడ్ వ్యాక్సిన్ పేరిట వృద్ధ దంపతులకు మత్తు ఇంజక్షన్ ఇవ్వడం చేసింది. ఈ ఇంజక్షన్ ఎఫెక్టుతో మత్తులోకి జారుకున్న దంపతుల వద్ద బంగారు మంగళసూత్రం, ఉంగరాలు, చెవిపోగులను దోచుకెళ్లింది. ఈ విషయమై మత్తు నుంచి తేరుకున్నాక మీరట్ పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. 
 
ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఈ విచారణలో అనుష అనే యువతి మీరట్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సింగ్ స్టూడెంట్ అని తేలింది. ఆపై పోలీసులు అనుషను కస్టడీలోకి తీసుకుని ఆమె దోచున్న ఆభరణాలను బాధితులకు అప్పగించేలా చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు