వృద్ధుడిని లాకరు గదిలో ఉంచి తాళం వేసిన బ్యాంకు సిబ్బంది

మంగళవారం, 29 మార్చి 2022 (17:14 IST)
హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ ఏరియాలో ఉన్న యూనియన్ బ్యాంకు సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యంగా నడుచుకున్నారు. బ్యాంకుకు వచ్చిన 87 యేళ్ళ వృద్ధుడిని లాకరు గదిలో ఉంచి బ్యాంకుకు తాళం వేశారు. దీంతో ఆ వృద్ధుడు 18 గంటల పాటు బ్యాంకు లోపలిభాగంలోనే ఉండిపోయారు. మరుసటి రోజు బ్యాంకుకు వచ్చిన సిబ్బంది అతన్ని గమనించి  విస్తుపోయారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిసీలిస్తే, సోమవారం సాయంత్రం 4.20 గంటల ప్రాంతంలో కృష్ణారెడ్డి (87) అనే వృద్ధుడు బ్యాంకుకు వెళ్లాడు. ఆయన బ్యాంకులోని లాకర్‌ గదిలో ఉన్న విషయాన్ని బ్యాంకు సిబ్బంది గమనించలేదు.
 
దీంతో బ్యాంకు పని వేళులు ముగియడంతో దానికి తాళం వేసి వెళ్లిపోయారు. బ్యాంకు నుంచి బయటకు రాలేక కృష్ణారెడ్డి అందులోనే ఉండిపోయారు. ఆయన వద్ద సెల్ ఫోన్ కూడా లేదు. దీంతో చీకటిపడినప్పటికీ ఆయన ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు స్థానిక పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేశఆరు. దీంతో పోలీసులు సీసీ టీవీ కెమెరాలు చూడగా కృష్ణారెడ్డి బ్యాంకులోనే ఉండిపోయినట్టు గుర్తించారు. 
 
మంగళవారం ఉదయం 10 గంటలకు బ్యాంకు సిబ్బంది వచ్చిన తర్వాత లాకరు గది నుంచి బ్యాంకు వృద్ధుడిని పోలీసులు రక్షించారు. మధుమేహం, బీపీతో బాధపడుతున్న వృద్ధుడిని తక్షణం ఆస్పత్రికి తరలించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు