ఇటీవలి కాలంలో హైదరాబాద్ నగరం నేరాలు ఘోరాలకు అడ్డాగా మారిపోతోంది. అమ్మాయిలకు, మహిళలకు ఏమాత్ర చివరకు వృద్ధులకు కూడా రక్షణ లేకుండా పోతోంది. ఈ క్రమంలో తాజాగా భాగ్యనగరిలో మరో దారుణ హత్య జరిగింది. ఓ వ్యక్తిని చంపిన గుర్తుతెలియని వ్యక్తులు శవాన్ని ఫ్రిజ్‌లో దాచిపెట్టారు.
అయితే, ఇంటి నుంచి రోజులు గడిచేకొద్ది దుర్వాసన వస్తుండంటంతో.. అపార్ట్‌మెంట్ యజమాని పోలీసులకు సమాచారమిచ్చాడు. దీంతో ఈ విషయం బయటపడింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రెహ్మత్ నగర్ డివిజన్ కార్మిక నగర్‌లో ఈ సంఘటన జరిగింది.
ఇది సిద్దిఖ్‌దిగా గుర్తించారు. ఇదిలాంటే.. రెండు రోజుల క్రితమే సిద్దిఖ్ భార్య రుబీనా తన పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే గొడవ పడి వెళ్లిందా? లేక ఎవైనా గొడవలు, ఆస్తి తగాదాలు ఉన్నాయా అనేది తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.