సొంత అల్లుడిని హతమార్చిన అత్త.. ఎందుకంటే..?

గురువారం, 29 అక్టోబరు 2020 (12:15 IST)
హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. ఉప్పల్‌లో తన సొంత అల్లుడిని హతమార్చింది ఓ అత్త. ఉప్పల్ రామంతపూర్ కేసీఆర్ నగర్‌లో అల్లుడిని అత్త హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. రామంతపూర్ కేసీఆర్ నగర్‌లో అనిత అనే ఆమె నవీన్ అనే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ నేపథ్యంలోనే అదే నవీన్‌కు తన కూతురును ఇచ్చి వివాహం చేసింది అనిత. 
 
నవీన్ వేధింపులు, అలానే తన తల్లితో తన భర్తకు ఉన్న వివాహేతర సంబంధాల విషయం బయటపడటంతో నాలుగు నెలల క్రితం అనిత కూతురు ఆత్మహత్య చేసుకుంది. అయినా ఆ తర్వాత కూడా నవీన్‌తో సంబంధం కొనసాగించింది సదరు అనిత. గత రాత్రి నవీన్ దగ్గరే ఉన్న అనీత కత్తితో నవీన్‌ను పొడిచి చంపింది. అయితే ఎందుకు చంపింది ఏమిటి అనే విషయాలు ఏవీ తెలియరాలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు