వాళ్లకేమైనా జరిగితే నేను కేసీఆర్ ఫామ్ హౌజ్‌కు వస్తా: బండి సంజయ్

సోమవారం, 8 ఫిబ్రవరి 2021 (16:12 IST)
బీజేపీ ఓబీసీ మోర్చా పదాధికారుల పరిచయ కార్యక్రమంలో పాల్గొన్నారు తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్. బడుగులు, బలహీన వర్గాల కోసం మేము పోరాడుతున్నామన్నారు. గిరిజనుల భూములు రక్షించేందుకు మావాళ్ళు వెళ్తే కబ్జాదారులకు కేసీఆర్ కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు.
 
సూర్యాపేట్ జిల్లా అధ్యక్షుడుతో సహా చాలామందిని పోలీసులు కిడ్నాప్ చేశారు. ఎవరిని ఎక్కడ పెట్టారో కూడా తెలియట్లేదు. మా వాళ్లకు ఏ హాని జరిగిన కేసీఆర్ ఫామ్ హౌజ్‌కు వస్తా. భయపడే ప్రసక్తే లేదు. గిరిజన భూముల కోసం మేము వెళ్తే కబ్జాదారుల కోసం కేసీఆర్ పోలీసులతో లాఠీచార్జి చేయించిండు.
 
మావాళ్లను బేషరతుగా వదిలేయాలి. మేము ఐపీఎస్ ఆఫీసర్లను జరుగుతున్న అవమానంపై ప్రశ్నిస్తున్నాం. రిటైర్ అయిన ఆఫీసర్లకు ఎక్స్‌టెన్షన్ ఇచ్చి అర్హులైన ఆఫీసర్లకు ద్రోహం చేస్తున్నారు. పోలీసులకు, మాకు గొడవ కాదు. పోలీసులు న్యాయంగా వ్యవహరించాలి. బీజేపీ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు, ఇతర నాయకుల్ని వెంటనే వదిలేయాలి.
 
నాగార్జున సాగర్‌లో గిరిజనులు ఖచ్చితంగా దీనిపై పగ తీర్చుకుంటారు. వచ్చే రెండేళ్లు ఓబీసీ మోర్చా పదాధికారులంతా కష్టపడాలి.పేదల గురించి ఆలోచించే పార్టీ బీజేపీ అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు