తెలంగాణ రాష్ట్రంలో సోమవారం నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు జరుగనున్నాయి. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ పరీక్షలకు 4,59,228 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. అయితే, పరీక్షా హాలుకు ఒక్క నిముషం ఆలస్యంగా వచ్చినా అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు.
సోమవారం నుంచి వచ్చే నెల మూడో తేదీ వరకు ఈ పరీక్షలు జరుగనున్నాయి. ఈ పరీక్షల నిర్వహణకుగానూ కోవిడ్ నిబంధనలను అనుసరించి, 1,768 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణ విధుల్లో కోవిడ్ వాక్సిన్ తీసుకున్న వారినే నియమించారు.