ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాం
ఈ సందర్భగా డా.లయన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ, ``తెలంగాణ ఫిలించాంబర్ ఆఫ్ కామర్స్ స్థాపించి ఏడేళ్లు పూర్తయింది. మా ఛాంబర్ స్థాపించిన తొలినాళ్లలో ఎంతో మంది అవహేళన చేశారు. కానీ మా ఛాంబర్ లో 8000 మంది సినీ కార్మికులు , 800 ప్రొడ్యూసర్స్, 400 టీ మా ఆర్టిస్టులు సభ్యులు గా చేరడంతో అవహేళన చేసినావారే ప్రశంసిస్తుంటే చాలా ఆనందంగా ఉంది. టియఫ్‌సిసి ద్వారా లాక్ డౌన్ సమయంలో కార్డు ఉన్నా లేకపోయినా 20వేల సినీ కార్మికులకు నిత్యావసర సరుకులు, ఆర్థిక సహాయం అందించాము. అంతేకాకుండా టిఎఫ్‌సిసి ద్వారా ప్రతి సంవత్సరం పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. పలువురు ఆర్టిస్టులకి 5లక్షల రూపాయల హెల్త్ కార్డులను అందజేశాము. వారి పిల్లలకు కూడా స్కాలప్ షిప్ అందిస్తున్నాం. అలాగే వారి సొంతింటి కల సాకారం కోసం మా వంతు సాయంగా రెండున్నర లక్షలు అందజేస్తున్నాం. ప్రమాదవశాత్తు మరణించిన వారికి రెండు లక్షల భీమా అందిస్తున్నాం.
ఏ గురురాజ్ మాట్లాడుతూ, `టియఫ్ సిసి ప్రారంభమై ఏడేళ్లు పూర్తి చేసుకుని 8000 వేల మంది సభ్యులుగా చేరడమన్నది సాధారణమైన విషయం కాదు. మొదట హేళన చేసిన వాళ్లే టియఫ్‌సిసి లో సభ్యత్వం ఇప్పటించమంటూ ఫోన్ చేసి అడుగుతున్నారు. టియఫ్‌సిసి తరఫున ఎంతో మందికి ఎన్నో రకాలుగా సేవ చేశాం. టియఫ్సిసిలో సభ్యుల సంఖ్య పెరగడంతో ఎలక్షన్స్ పెడుతున్నాం. నవంబర్ 14న పోటాపోటీగా ఎలక్షన్స్ జరగున్నాయి. ఎవరైనా పోటీ చేయవచ్చు`` అన్నారు.
తెలంగాణ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ స్నిగ్ధ మాట్లాడుతూ,``ఇప్పటి వరకు టీమా లో ఎన్నో అభివృద్ధి పనులు చేసాం. ఇక పైన కూడా చేస్తాం. తెలంగాణ కళాకారులకు అవకాశాలు పెద్ద ఎత్తున ఇప్పించడానికి ప్రయత్నిస్తాం`` అన్నారు.
అడ్వకేట్, ఎలక్షన్ అధికారి కేవియల్ నరసింహారావు మాట్లాడుతూ...``ఈ నెల 14న ఫిలింనగర్‌లోని టియఫ్‌సిసి కార్యాలయమందు టియఫ్సిసితో పాటు టీమా ఎలక్షన్స్ జరగనున్నాయి. అదే రోజున ఫలితాలు కూడా ప్రకటించనున్నాం అంటూ ఎన్నికల షెడ్యూల్ తో పాటు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు.