ఏది రాసినా పాస్ చేస్తానని ఫెయిల్ చేశారు.. కేటీఆర్‌కు ట్వీట్

గురువారం, 16 డిశెంబరు 2021 (22:35 IST)
తెలంగాణ ఇంటర్ తొలి సంవత్సరం ఫలితాలను గురువారం ప్రకటించింది. ఈ ఫలితాలు సగానికి సగం మంది కూడా ఉత్తీర్ణత సాధించలేదు. దీంతో విద్యార్థులు మానసికంగా కృంగిపోయారు. దీంతో విద్యాశాఖ అప్రమత్తమైంది. 
 
కానీ అనుకున్న విధంగానే ఓ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటానని ట్విట్టర్ వేదికగా మంత్రులు కేటీఆర్, సబితలను ట్యాగ్ చేస్తూ హెచ్చరించాడు. తాను నాలుగు సబ్జెక్టులు ఫెయిల్ అయ్యానని, ఏది రాసినా పాస్ చేస్తా అని చెప్పి అందరినీ ఫెయిల్ చేశారు అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. 
 
తీరా పోస్ట్ వైరల్ అవడంతో.. తాను ఇప్పుడు బాగున్నానని, తనకు మోటివేట్ చేసినందుకు కృతజ్ఞతలు అంటూ మరో ట్వీట్ చేశాడు. ఇలాంటి ఘటనల నేపథ్యంలో విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చేందుకు సైకాలజిస్టులను నియమించింది తెలంగాణ విద్యా శాఖ. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు