కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి గ్రామంలోని సెయింట్ ఆన్స్ హైస్కూల్ విద్యార్థులు కరాటే పోటీలలో తమ ప్రతిభను చాటారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట లోని బైతేస్థ రమేష్ ప్రాంగణంలోని కె. వి. ఫంక్షన్ హాల్ లో న్యూషావలింగ్ కుంగ్ఫు అకాడమీ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మెమోరియల్, విక్టరీ ఫోటోకాన్ కరాటే అసోసియేషన్ వారు నిర్వహించిన జాతీయ స్థాయి కరాటే, కుంగ్ఫు పోటీలలో కృష్ణా జిల్లా, ఇబ్రహీంపట్నం గుంటుపల్లి గ్రామానికి చెందిన సెంటెన్స్ హై స్కూల్ విద్యార్థులు పలు విభాగాలలో బహుమతులు గెలుపొందారు. ఆ వివరాలను హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలు సిస్టర్. రోస్లీ, తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు, బాలికలు బాలుర విభాగంలో 35 ప్రధమ, 15 ద్వితీయ, 10 తృతీయ విభాగాలలో గెలుపొందారని తెలిపారు.
బాలికల విభాగంలో ఓవరాల్ గ్రౌండ్ ఛాంపియన్షిప్ ను, బాలుర విభాగంలో గ్రౌండ్ ఛాంపియన్షిప్ ను గెలుపొందారు. పాఠశాల కరస్పాండెంట్. సిస్టర్ అమల, సీబీఎస్సీ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు జైన్ యాంటోని, పి.ఈ టి. బోనం బాలరాజు, కరాటే మాస్టర్. డి నరసింహారావు, గెలుపొందిన విద్యార్థినీ విద్యార్థులకు ప్రత్యేకంగా అభినందించారు.