జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. నిజానికి గతంలో కవిత కోసం తన పదవికే రాజీనామా చేస్తానని సంజయ్ గతంలో వార్తల్లో నిలిచారు. సోమవారం కూడా కవిత ఎమ్మెల్సీగా గెలిచాక ఆమెకు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఇటీవల సంజయ్ కుమార్ ఓ వేడుకకు హాజరు కావడంతోనే కరోనా వైరస్ సోకి వుండవచ్చునని భావిస్తున్నారు.