ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ జల్లికట్టు ఆందోళన నేపధ్యంలో సంచలన వ్యాఖ్య చేశారు. తమిళనాడులో జల్లికట్టుపై జరుగుతున్న ఆందోళన చూస్తుంటే భారతదేశంలో ఉమ్మడి పౌరస్మృతి సాధ్యం కాదని సంచలన వ్యాఖ్య చేశారు. అంతేకాదు.. ఇది హిందుత్వ శక్తులకు గుణపాఠం అనీ, ఈ దేశంలో ఒకే సాంప్రదాయం లేనందువల్ల జల్లికట్టుపై నిరసనలు పెల్లుకుబుతన్నాయంటూ ట్వీట్ చేశారు.
గతంలో కూడా ఉమ్మడి పౌరస్మృతిపైన అసదుద్దీన్ వ్యాఖ్యానించారు. దేశంలో వివిధ మతాలు, కులాలు ఉన్నప్పుడు అందరికీ ఒకే పౌరస్మృతి ఎలా సాధ్యమంటూ ప్రశ్నించారు. కాగా అసదుద్దీన్ ట్వీట్లపై భాజపా మండిపడింది. సంప్రదాయాల గురించి జరుగుతున్న ఆందోళనల్లో మత ప్రస్తావనం ఎందుకుంటూ ప్రశ్నిస్తోంది.