గులాబ్‌ తుఫాన్‌: JNTUH పరీక్షలు వాయిదా..

సోమవారం, 27 సెప్టెంబరు 2021 (14:16 IST)
తెలంగాణలో కురుస్తున్న వర్షాల కారణంగా నేడు జరగాల్సిన పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు జేఎన్టీయూ ప్రకటించింది. బీటెక్, ఫార్మసీ పరీక్షలు వాయిదా బడ్డాయి. నేడు జరగాల్సిన పరీక్షల షెడ్యూలు తర్వాత చేయనున్నారు. అయితే రేపట్నుంచి జరగాల్సిన పరీక్షలు యథాతథం కొనసాగుతాయని జేఎన్టీయూ వెల్లడించింది. 
 
తెలంగాణపై గులాబ్‌ తుఫాన్‌ ప్రభావం గట్టిగా ఉండనుంది. రానున్న మూడు రోజులపాటు జిల్లాలతోపాటు హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. 
 
మరోవైపు కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు సీఎస్‌ సోమేష్‌ కుమార్‌. ప్రతీ జిల్లాలో కంట్రోల్‌ రూమ్స్‌ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. గులాబ్ తుపాన్ ప్రభావం తెలుగు రాష్ట్రాలపై పడుతోంది. తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
 
తుపాన్ కారణంగా రాబోయే మూడు రోజుల్లో హైదరాబాద్ నగరంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్‌, కామారెడ్డి, సిరిసిల్ల, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు