జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు: కార్పొరేటర్‌ కుమారుడిపై దాడి..

మంగళవారం, 14 జూన్ 2022 (08:09 IST)
జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ నిందితుల మధ్య జువైనల్ హోమ్‌లో ఘర్షణ జరిగింది. ఆదివారం రాత్రి భోజనాల సమయంలో ఐదుగురు నిందితులలో నలుగురు ఒక్కటై కార్పొరేటర్‌ కుమారుడైన మైనర్‌ నిందితుడిపై దాడికి దిగారు.
 
నిందితులు పరస్పరం దాడికి పాల్పడటంతో అప్రమత్తమైన నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో బందోబస్తును పెంచారు.
 
ఇకపోతే.. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సాదుద్దీన్‌ మాలిక్‌ కస్టడీ ఆదివారంతో ముగిసింది. కస్టడీ ముగియడంతో పోలీసులు అతడిని సోమవారం ఉదయం కోర్టులో హాజరు పరచగా న్యాయస్థానం 14 రోజుల రిమాండ్‌ విధించింది. అనంతరం నిందితుడిని పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. 
 
మైనర్‌ బాలికపై నిందితులు పథకం ప్రకారమే లైంగిక దాడికి పాల్పడ్డారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. పబ్‌లో జరిగే పార్టీకి వచ్చే అమ్మాయిలను ట్రాప్‌ చేయాలన్న ఆలోచన ఎవరిది, బాలికపై లైంగిక దాడికి పాల్పడాలన్న ప్రతిపాదన ఎవరిదన్న విషయాన్ని కూడా తెలుసుకునేందుకు పోలీసులు సన్నద్దమవుతున్నారు.
 
అత్యాచార నిందితులు ఆరుగురిని పోలీసులు విచారించినపుడు ఒకరి స్టేట్‌మెంట్‌కు మరొకరి స్టేట్‌మెంట్‌కు వ్యత్యాసాలున్నాయని పోలీసులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు