ఆ విషయంలో కెసిఆర్ చేతులు తప్ప ఎవరివీ పట్టుకోనన్న కేకే..?

శుక్రవారం, 11 సెప్టెంబరు 2020 (21:57 IST)
కాంగ్రెస్ పార్టీలో ఉన్న కె.కేశవరావును టిఆర్ఎస్‌లోకి తీసుకుని పార్లమెంటరీ నేతగా అవకాశం ఇచ్చారు చంద్రశేఖర్ రావు. అందుకే టిఆర్ఎస్ పార్టీ అన్నా.. కెసిఆర్ అన్నా కేకేకు గౌరవం. ఆ గౌరవంతోనే తనకు కాంగ్రెస్ పార్టీ ఎలాంటి పదవులు ఆశ చూపిస్తున్నా వెల్లడం లేదట. 
 
తాజాగా కేశవరావుకు రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌గా పోటీచేసే అవకాశం వచ్చింది. ఆ పదవికి పోటీ చేస్తే సపోర్ట్ చేస్తామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ స్వయంగా కేకేకి ఫోన్ చేశారు. ఈ విషయాన్ని స్వయంగా కేకేనే వెల్లడించారు. 
 
యుపీఏ పక్షాన తాము మద్దతుగా నిలబడతామని.. ఇతర పక్షాలను అన్ని విధాలా ఒప్పించే బాధ్యతలను మేము తీసుకుంటామని ఆజాద్ హామీ ఇచ్చారట. ఎన్డీయేను ఎదుర్కొనేందుకు ఇదొక మంచి అవకాశమని కూడా చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో కెసిఆర్ చేతులు తప్ప ఇతర పార్టీల నేతల చేతులు తాను పట్టుకోనని కేకే తేల్చిచెప్పారట.
 
ఇదే విషయాన్ని కెసిఆర్ దృష్టికి తీసుకెళితే అఆయన నో అని చెప్పారట. ఆ సీటుపై ఎలాంటి చూపడం లేదట కెసిఆర్. ఈనెల 14వతేదీన రాజ్యసభకు సంబంధించిన డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక జరుగబోతున్న నేపథ్యంలో ఈ ఎన్నికల ఆశక్తికరంగా మారుతోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు