స్థానిక ప్రభుత్వ బాలికల ప్రాథమిక పాఠశాలలో రోజూ మాదిరిగానే 321 విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేశారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఒక్కొక్కరికి వాంతులు, కడుపునొప్పి ప్రా రంభమైంది. దీంతో ఉపాధ్యాయులు ఈ విషయం బయటికి పొక్కకుండా ప్రయత్నించారు.
ఈ విషయం తెలుసుకున్న ఎంపీపీ తిలకేశ్వరి రఘు, ఎస్సై రాజేశ్, రైతు బంధు సమితి అధ్యక్షుడు అవారి గంగారాం పాఠశాలకు చేరుకొని పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పాఠశాలకు చేరుకున్న డీఎంహెచ్‌వో కల్పన భోజనం శాంపిళ్లను సేకరించాలని మండల వైద్యాధికారిని ఆదేశించారు. శాంపిళ్లను ల్యాబ్‌కు పంపిన తర్వాతే కారణాలు తెలుస్తాయన్నారు. బాధిత చిన్నారులను తెలంగాణ శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆస్పత్రికెళ్లి పరామర్శించారు.