బీజేపీపై కేసీఆర్‌ గుర్రు

శనివారం, 24 ఆగస్టు 2019 (10:14 IST)
విద్యుత్తు కొనుగోళ్లలో భారీ కుంభకోణం జరిగిందన్న బీజేపీపై సీఎం కేసీఆర్‌ గుర్రుగా ఉన్నారు. తక్కువ ధరకు కేంద్రం ఇస్తానన్నా, కమీషన్ల కోసమే ప్రైవేటు సంస్థల నుంచి అధిక ధరలకు కొనుగోలు చేశారన్న  రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ చేసిన ఆరోపణలపై మండిపడ్డారు.

విద్యుత్తు శాఖపై బీజేపీ విమర్శలను దీటుగా తిప్పికొట్టాలని, కమలనాథులను కడిగేయాలని పార్టీ యంత్రాంగంతోపాటు అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ‘‘మణుగూరులో సబ్‌ క్రిటికల్‌ ప్లాంటుకు అనుమతి ఇచ్చింది బీజేపీ ప్రభుత్వానికి చెందిన కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి కాదా?

ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ ముఖ్యమంత్రి రమణ్‌ సింగ్‌ అధికారంలో ఉన్నప్పుడు 1000 మెగావాట్ల విద్యుత్తుకు ఒప్పందం చేసుకున్నది వాస్తవం కాదా? ఆ రాష్ట్ర ప్రభుత్వ సంస్థతోనే ఒప్పందం జరిగింది. ఇందులో అవినీతికి ఆస్కారం ఎక్కడిది?

తెలంగాణ ఆవిర్భావ సమయంలో సౌర విద్యుత్తు 77 మెగావాట్లే. సౌర విద్యుత్తు పాలసీ తర్వాత దాని సామర్థ్యం 3600 మెగావాట్లకు చేరింది. దాంతో, జాతీయ స్థాయిలో తెలంగాణ రెండో స్థానంలో ఉందని కేంద్ర మంత్రి ఆర్కే సింగ్‌ సన్మానం కూడా చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు