అన్నను, అన్న కూతురిని, తన సొంత కూతురిని చంపాడు. ఆపై తాను గొంతు కోసుకున్నాడు. అనంతరం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
కామారెడ్డి జిల్లాలో ముగ్గురు కుటుంబ సభ్యులను హత్య చేసిన నిందితుడు.. ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నిన్న దోమకొండ సమీపంలోని అటవీ ప్రాంతంలో భిక్కనూర్ మండలం జంగంపల్లికి చెందిన బందెల రవి.. తన అన్న బాలయ్య, బాలయ్య కూతురు లత, తన సొంత కూతురు చందనను శీతల పానీయంలో పురుగుల మందు కలిపి తాగించి... ఆపై గొంతు కోసి చంపేశాడు.