నల్గొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో అధికార తెరాస విజయం దిశగా దూసుకెళుతుంది. దీనిపై బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, ఇది తెరాకు దక్కిన అధర్మ విజయమన్నారు. ఇక్కడ తాము నైతికంగా విజయం సాధించామన్నారు.
తెరాస అధికార దుర్వినియోగానికి పాల్పడిందని, అధికారులను సీఎం కేసీఆర్, కేటీఆర్ ప్రభావితం చేశారని ఆయన ఆరోపించారు. పోలీస్ వ్యవస్థను తెరాస సొంత పార్టీ ప్రయోజనాలకు వాడుకుందని ఆయన అన్నారు. కనీంస తమను ప్రచారం కూడా చేసుకోనివ్వలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ ప్రజాతీర్పును గౌరవిస్తున్నట్టు చెప్పారు.
ఇదిలావుంటే మునుగోడు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపులో 12 రౌండ్లు పూర్తయ్యే సరికి తెరాస జోరు ప్రదర్శిస్తుంది., 12వ రౌండ్‌లో తెరాసకు 2042 ఓట్ల ఆధిక్యం లభించింది. 12 రౌండ్లు ముగిసే సరికి గులాబీ పార్టీ ఆధిక్యం 7807 ఓట్లకు పెరిగింది. ఇప్పటివరకు 82005, బీజేపీకి 74198, కాంగ్రెస్ పార్టీకి 17627 ఓట్లు లభించాయి. మరో మూడు రౌండ్ల ఓట్ల లెక్కింపు జరగాల్సివుంది. అయినప్పటికీ తెరాస విజయం ఇక లాంఛనప్రాయంగా మారింది.