ఉత్కంఠతలో మునుగోడు ఓట్ల లెక్కింపు : వెళ్లిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి

ఆదివారం, 6 నవంబరు 2022 (11:12 IST)
మునుగోడు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం ఉదయం నుంచి ప్రారంభమైంది. అయితే, ప్రతి రౌండ్‌లోనూ ఆధిక్యం దోబూచులాడుతోంది. దీంతో తీవ్ర ఉత్కంఠతను రేపుతున్నాయి. రౌండ్ రౌండ్‌కు ఫలితాల సరళి మారిపోతోంది. తొలి రౌండ్‌లో తెరాస ఆధిక్యం సాధించగా రెండో రౌండ్‌లో బీజేపీ అభ్యర్థి ముందంజలో నిలిచారు.
 
మరోవైపు, ఈ పోటీలో కాంగ్రెస్ పార్టీ బాగా వెనుకబడిపోయింది. కాంగ్రెస్ గెలుపు అసాధ్యమనే విషయాన్ని గ్రహించిన ఆ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. దీంతో ఆమె ఓట్ల లెక్కింపు పూర్తికాకముందే తన ఓటమిని అంగీకరించారు. ఫలితంగా కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర నిరాశలో కూరుకునిపోయారు. 
 
మరోవైపు, నాలుగో రౌండ్ ముగిసే సమయానికి తెరాస అభ్యర్థి ఓవరాల్‌గా బీజేపీ అభ్యర్థిపై 613 ఓట్లతో ఆధిక్యాన్ని సాధించారు. ఈ ఓట్ల లెక్కింపులో నాలుగో రౌండ్ ముగిసే సమయానికి తెరాస పుంజుకుంది. వెరసి బీజేపీకి మంచి పట్టుందని భావించిన చౌటుప్పల్‌లో తెరాస 613 ఓట్ల ఆధిక్యాన్ని సాధించింది. నాలుగో రౌండ్‌ లెక్కింపుతో చౌటుప్పల్ మండల ఓట్ల లెక్కింపు పూర్తి చేసిన అధికారులు ఆ తర్వాత సంస్థాన్ నారాయణపూర్ మండల ఓట్ల లెక్కింపును మొదలుపెట్టారు.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు