మందుబాబులకు షాక్: బీరుపై రూ.20 పెంపు.. ఫుల్ బాటిల్‌పై రూ. 80పెంపు

గురువారం, 19 మే 2022 (09:48 IST)
తెలంగాణలోని మందుబాబులకు షాకింగ్ న్యూస్. రాష్ట్రంలో మద్యం ధరలు పెంచుతూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. పెరిగిన మద్యం ధరలు ఈ నెల 19 నుంచి అమల్లోకి రానున్నట్లు ప్రభుత్వం తెలిపింది. 
 
ఈ పెరిగిన ధరల ప్రకారం ఒక్కో బీరుపై 20 రూపాయలు పెంచుతున్నట్లు తెలుస్తోంది. మద్యం క్వార్టర్‌పై 20 రూపాయలు పెంచనున్నారు. ఈ లెక్కన ఫుల్ బాటిల్‌పై 80 రూపాయలు పెరగనుంది. అయితే ఎంత మేర ధరలు పెరిగాయనే వివరాలను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
 
మద్యం దుకాణాల్లో బుధవారం అమ్మకాలు పూర్తి కాగానే మద్యం సీజ్‌ చేశారు అధికారులు. ఆపై నిల్వలు లెక్కించి గురువారం( మే19) నుంచి పెరిగిన ధరల ప్రకారం విక్రయించేలా చర్యలు తీసుకోనున్నట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు