నిజాం కాలంలోనూ లాక్‌డౌన్!..ఎందుకో తెలుసా?

సోమవారం, 27 ఏప్రియల్ 2020 (06:07 IST)
1866వ సంవత్సరంలో నిజాం-బ్రిటీష్ పాలన సమయంలో కూడా హైదరాబాద్‌ సంస్థానంలో ఓ సారి లాక్‌డౌన్ విధించారట.

ఆ సమయంలో కలరా, ప్లేగు వ్యాధులు హైదరాబాద్‌ని..కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించాయి ప్రపంచ దేశాలు. దీంతో లాక్‌డౌన్ అంటే ఏంటో అందరికీ అర్థమయ్యింది.

ఎన్నడూ లేని విధంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే మన నిజాం కాలంలోనూ ఈ లాక్‌డౌన్ విధించారట.

అప్పటికి సంబంధించిన కొన్ని ఫొటోలు ఈ మధ్య నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే అప్పుడు లాక్‌డౌన్ ఎలా విధించారంటే?

1866వ సంవత్సరంలో నిజాం-బ్రిటీష్ పాలన సమయంలో కూడా హైదరాబాద్‌ సంస్థానంలో ఓ సారి లాక్‌డౌన్ విధించారట. ఆ సమయంలో కలరా, ప్లేగు వ్యాధులు హైదరాబాద్‌ని అతలాకుతం చేశాయి.

దీంతో వ్యాధులు ప్రబలడాన్ని అరికట్టడానికి అప్పటి పాలకులు లాక్‌డౌన్ విధించారట. అయితే అప్పట్లో లాక్‌డౌన్ అనే పదాన్ని వినియోగించలేదు. కానీ లాక్‌డౌన్ని ‘వేతనంతో కూడిన సెలవు, ప్రత్యేక సెలవుగా’ పిలిచేవారట.

అప్పట్లో కూడా కలరా, ప్లేగు వ్యాధులను నివారించడానికి పాలకులు ఈ ప్రత్యేక సెలవును ఉపయోగించేవారట. ఇప్పటిలాగే రైళ్లు, బండ్లు, ఓడలను ఆపివేశారు. ప్రజలను ఇంటి నుంచి బయటకు రాకుండా చూసేవారు.

కంటైన్‌మెంట్ జోన్లు, ఐసోలేషన్ ఆస్పత్రులు వంటి వాటిని అప్పట్లో కూడా ఏర్పాటు చేశారట. అలాగే అప్పుడు కూడా వలస కూలీల సమస్య ఏర్పడింది.

దీంతో ముందుగానే వలస కూలీలకు 32 రోజుల జీతాన్ని చెల్లించి, వారి సొంతూళ్లకు పంపించేవారని పలు వార్తలు వచ్చాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు