బంగారం లాంటి భార్య, ఇద్దరు పిల్లలు, అయినా పనిమనిషిపై కన్నేసి అత్యాచారం చేశాడు

గురువారం, 1 అక్టోబరు 2020 (11:28 IST)
ఇంట్లో పనిచేసే పనిమనిషిపై యజమాని కన్ను పడింది. 18 యేళ్ళ యువతి పనిమనిషి కావడం ఆమెకు పెద్ద దిక్కు ఎవరూ లేకపోవడంతో యజమానికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ఇద్దరు పిల్లలుండి.. బంగారం లాంటి భార్య ఉన్నా అతను పనిమనిషినిని మాత్రం వదిలిపెట్టలేదు. చివరకు ఆమె ప్రాణాలు తీసుకునేలా చేశాడు. 
 
రంగారెడ్డి జిల్లా మెయినాబాద్‌లో నివాసముండే మధుయాదవ్ ఇంట్లో సాదియా అనే యువతి పనిచేస్తూ ఉండేది. ఆమె చెల్లెలు నిహా కూడా ఆమెతో పాటు కలిసి అక్కడే ఉండేవారు. తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోవడంతో అక్కడక్కడ ఇంటి పనులు చేసుకుంటూ బతుకు జీవనం కొనసాగించేవారు.
 
అయితే మధు యాదవ్ ఇంట్లో గత మూడునెలల నుంచి పని చేస్తున్నారు. అక్కడే ఉంటున్నారు. మధుకు పెళ్ళయి ఇద్దరు పిల్లలు. ఎలాంటి ఇబ్బందులు లేని జీవితం. అయితే ఇంట్లో పనిచేస్తున్న సాధియాపై మనస్సు పారేసుకున్నాడు మధు.
 
ఆమెను శారీరకంగా అనుభవించాలనుకున్నాడు. లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు. యజమాని లైంగికంగా వేధించినా చెప్పుకునే పెద్ద దిక్కు లేకపోవడంతో ఆమె మనస్సులోనే తన బాధను దిగమింగుతూ వచ్చింది. అయితే అతని చేష్టలు మరింత ఎక్కువకావడంతో చేసేది లేక ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల విచారణలో నిందితుడు మధు యాదవ్ అని తెలియడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు