తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు : నేడు కాంగ్రెస్ మేనిఫెస్టో

శుక్రవారం, 17 నవంబరు 2023 (10:32 IST)
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ శుక్రవార మేనిఫెస్టోను రిలీజ్ చేయనుంది. ఈ నెల 30వ తేదీన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఇందుకోసం కాంగ్రెస్ పార్టీతో పాటు, భారాస, బీజేపీలు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయి. అలాగే, ఓటర్లను ఆకర్షించేందుకు అనేక రకాలైన ఎన్నికల హామీలను గుప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోను విడుదల చేయనుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు ప్రకటించింది. శుక్రవారం పూర్తి స్థాయి మేనిఫెస్టోను విడుదల చేసేందుకు సిద్ధమైంది. 
 
ఈ మేనిఫెస్టోను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విడుదల చేయనున్నారు. ఇందులో కాంగ్రెస్ జాతీయ నేత  మాణిక్ రావు ఠాక్రే, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబుతో పాటు పలువురు సీనియర్ నేతలు పాల్గొననున్నారు. పేదలు, మధ్యతరగతి, రైతులను ఆకట్టుకునేలా మేనిఫెస్టోను రూపొందించినట్టు సమాచారం. ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందేలా ఈ మేనిఫెస్టోను రూపకల్పన చేసినట్టు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. 
 
ముఖ్యంగా, ఇందిరమ్మ బహుమతి పథకం కింద వివాహ సమయంలో అర్హులైన మహిళలందరికీ లక్ష రూపాయల సహాయం 10 గ్రాముల బంగారం అందించననున్నారు. విద్యార్థులందరికీ ఉచిత ఇంటర్నెట్ కల్పించనున్నారు. 18 ఏళ్లు నిండిన మహిళా కళాశాలకు వెళ్లే విద్యార్థులందరికీ ఉచిత ఎలక్ట్రిక్ స్కూటర్లు అందిస్తారు. విద్యా భరోసా కార్డు కింద ప్రతి కళాశాలకు వెళ్లే విద్యార్థికి 5 లక్షలు విద్యా ఖర్చుల కోసం అందిస్తారు. ఆరోగ్య శ్రీ కింద 10 లక్షలు, అన్ని ప్రధాన వ్యాధులను కవర్ చేసేలా కొత్త ఆరోగ్య శ్రీ పథకాన్ని అందిస్తారు. జర్నలిస్టు సంక్షేమ నిధికి రూ.100 కోట్లు కేటాయిస్తారు. మరణించిన జర్నలిస్టుల కుటుంబానికి రూ.2 లక్షలు, హెల్త్ కార్డులు, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వనున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు