కరోనా భయంతో భవనం పైనుంచి దూకి ఆత్మహత్య

గురువారం, 23 జులై 2020 (23:56 IST)
హైదరాబాద్, శ్రీనగర్ కాలనీలోని నిఖిల్ హాస్పిటల్ భవనంపై నుంచి దూకి ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగి నరేందర్ ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం ఉదయం శ్వాస సంబంధ సమస్యలతో హాస్పిటల్లో చేరిన నరేందర్ కరోనా వచ్చిందని అనుమానంతో ఆసుపత్రి భవనం పైనుంచి దూకి ఆత్మహత్య యత్నం చేశాడు.
 
చెట్ల మీద పడిపోయి తీవ్రగాయాలతో కొట్టుమిట్టాడిన నరేందర్‌ను తీసుకెళ్లి ఆసుపత్రిలో చికిత్స చేసినా ఫలితం లేదు.చికిత్స పొందుతూ మృతి చెందాడు. కరోనా వైరస్ కన్నా భయం 
చాలా ప్రమాదమని వైద్యులు, మానసిక నిపుణులు ఒకవైపు దైర్యం చెపుతున్నా ఇటువంటి ఘటనలు జరగడం విషాదం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు