తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితలు సొంత బావా మరదళ్లు. అయితే, మంత్రి హరీష్ రావు శుక్రవారం తన పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నారు. దీన్ని పురస్కరించుకుని ఆయనకు రాజకీయ, సినీ రంగాలకు చెందిన ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
మరోవైపు, హరీష్ రావు పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే హరీష్ రావు అభిమానులు, తెరాస కార్యకర్తలు పలు రకాలైన సేవా కార్యక్రమాలను చేపట్టారు. తన జన్మదినం సందర్భంగా తనపై ఉన్న ప్రేమను ప్రజలకు ఉపయోగపడేలా సేవా కార్యక్రమాల ద్వారా చాటాలని అభిమానులు, కార్యకర్తలు హరీష్ రావు సూచించిన విషయం తెల్సిందే.