నేడు మరింతగా బలపడనున్న అల్పపీడనం - రెండు రాష్ట్రాలకు వర్షాలు

శుక్రవారం, 19 ఆగస్టు 2022 (09:31 IST)
వెస్ట్ బెంగాల్, బంగ్లాదేశ్ సముద్ర తీరంలో ఏర్పడిన అల్పపీడనం శుక్రవారం మరింతగా బలపడనుంది. దీంతో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా, ఉత్తర కోస్తాలో ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావం కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పలు చోట్ల నేడు, రేపు ఓ మోస్తరు నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. 
 
ఉత్తర కోస్తా, యానాంలలో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. శనివారం తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. దక్షిణ కోస్తాలోని ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్న అధికారులు రాయలసీమలో నేడు, రేపు అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు