భర్తకు దూరమైంది. ఆపై వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఇందుకు కన్నకొడుకు అడ్డుగా ఉన్నాడని చిత్రహింసలకు గురిచేసింది. అమ్మతనానికే మచ్చతెచ్చింది. ఈ ఘటన మెదక్ జిల్లా సంగారెడ్డిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మెదక్ జిల్లా సంగారెడ్డి టౌన్‌కు చెందిన మురళీకృష్ణ- అనూషలకు 2005లో వివాహమైంది. వీరికి విష్ణువర్ధన్ (11), హర్షవర్ధన్ (9) అనే ఇద్దరు కుమారులు వున్నాయి.